Monday, January 29, 2018

బ్రాహ్మణ అనే పదానికి సంబంధించిన భ్రాంతులు మరియు వాటి నివారణలు



బ్రాహ్మణ అనే పదానికి సంబంధించిన భ్రాంతులు మరియు వాటి నివారణలు

డాక్టర్ వివేక్ ఆర్య

నేటి సమాజంలో బ్రాహ్మణ అనే పదానికి సంబంధించి ఎన్నో భ్రాంతులు ఉన్నాయి. వీటిని తొలగించడం అత్యంత అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే హిందూ (భారతీయ) సమాజం యొక్క అత్యంత బలహీనత "కులతత్వం" అనే గజ్జి. బ్రాహ్మణ అనే పదానికి సరైన అర్థం తెలుసుకోకుండా ఉండడం వలన కులతత్వం  అనే గజ్జి బాగా విస్తరించింది.

ప్రశ్న 1: బ్రాహ్మణ పదం యొక్క పరిభాష తెలుపుము?

సమాధానం: చదవడం - చదివించడం, చింతనం - మననం చేయడం,  బ్రహ్మచర్యం, అనుశాసనం, సత్యం పలకడం, మరియు ఇతర వ్రతాలు ఆచరించడం, పరోపకారం - సత్య కర్మలు చేయడం, వేదాలు - విజ్ఞానం చదవడం, కర్తవ్యాన్ని నిర్వహించడం, దానం చేయడం, మరియు ఇతర ఆదర్శాలు కి సమర్పించడం తో మనుష్యుడి యొక్క శరీరం బ్రాహ్మణ అనబడుతుంది. (మనుస్మృతి 2/28)

ప్రశ్న 2: బ్రాహ్మణ అంటే కులమా లేక వర్ణమా?

సమాధానం: బ్రాహ్మణ అంటే కులం కాదు. వర్ణం యొక్క అర్దం "ఎన్నుకోవడం" (To Choose), సామాన్యంగా వర్ణం యొక్క అర్దం ఇదే. వ్యక్తి తన గుణ, కర్మ, స్వభావం, రుచి, యోగ్యత ను అనుసరించి, స్వయంగా వరణం చేస్తాడు, అందువలనే దీని యొక్క పేరు "వర్ణం" అంటారు. వైదిక వర్ణ వ్యవస్థ లో "నాలుగు" వర్ణాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యా మరియు శూద్ర.

బ్రాహ్మణుడి యొక్క కర్మలు: చక్కగా చదవడం - చదివించడం (అందరికి), యజ్ఞాలు చేయడం - చేయించడం, దానాన్ని స్వీకరించడం మరియు యోగ్య వ్యక్తుల కు దానం చేయడం, త్యాగ గుణం, ధర్మాన్ని - జీవ ఏకత్వం ని ప్రచారం చేయడం.


క్షత్రియుడి యొక్క కర్మలు: చక్కగా చదవడం, యజ్ఞం చేయడం, ప్రజలను పాలించడం - పోషించడం - రక్షించడం, 
యోగ్య వ్యక్తుల కు దానం చేయడం, ధనం - ఎశవర్యాలా వ్యాయామం లేకుండా జితేంద్రియుడి లా ఉండడం, ధర్మాన్ని అనుసరించడం.


వైశ్యుడి యొక్క కర్మలు: పశువుల పోషణ చేయడం, యోగ్యులకు దానం చేయడం, యజ్ఞం చేయడం, వ్యాపారం - వ్యవసాయం చేయడం, ధనం సంపాదించడం, చక్కగా చదవడం, ధర్మాన్ని అనుసరించడం.



శూద్రుడి యొక్క కర్మలు: ధర్మాన్ని అనుసరించడం, నాలుగు వర్ణాల వారిని తన శ్రమ-బలం తో (Physical Activity) సేవ చేయడం.


శూద్ర పదాన్ని మనుస్మృతి మరియు వేదాల లో కానీ ఎక్కడా అవమానకరంగా, నీచంగా, నికృష్టంగా అనబడ లేదు. మహర్షి మను ప్రకారం నాలుగు వర్ణాల బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యా మరియు శూద్ర అందరూ "ఆర్యులు" (శ్రేష్టమైన వ్యక్తులు/Noble People)  (మనుస్మృతి 10/4)


ప్రశ్న 3: మనుష్యుల లో ఎన్ని జాతులు/కులాలు ఉన్నాయి?

సమాధానం: మనుష్యుల లో కేవలం ఒక్కటే జాతి/కులం ఉంది. అది " మనుష్య జాతి/కులం ".  వేరే ఏమీ లేవు.


ప్రశ్న 4: నాలుగు వర్ణాలు గా విభజించడం గల ఆధారం లేకా కారణం ఏమిటి?

సమాధానం: వర్ణ వ్యవస్థ యొక్క మూల ఆధారం/కారణం "కర్మ విభజన సిద్ధాంతం" (Division Of Labour). వర్ణ విభజన యొక్క మూల ఆధారం/కారణం "వ్యక్తి యొక్క యోగ్యత". ఈనాటి సమాజాం లో నేటికీ, చదువులు పూర్తి అయిన తరువాత, వ్యక్తి తన యోగ్యత వల్ల డాక్టర్, ఇంజనీర్, లాయర్, పోలీసు, సైంటిస్ట్, ఉపాధ్యాయుడు, వ్యాపారి అవుతారు. పుట్టుకతో ఎవరు డాక్టర్, ఇంజనీర్, లాయర్, పోలీసు, సైంటిస్ట్, ఉపాధ్యాయుడు, వ్యాపారి అవలేరు. ఇదే వర్ణ వ్యవస్థ.


ప్రశ్న 5: ఎవరైనా బ్రాహ్మణుడు పుట్టుకతో అవుతారా లేక గుణ, కర్మ మరియు స్వభావం ద్వారా అవుతారా?

సమాధానం: వ్యక్తి యొక్క యోగ్యత శిక్షణ (చదువులు) పూర్తయిన తర్వాత నిర్ధారిస్తారు. పుట్టుక యొక్క ఆధారం తో కానేకాదు. ఏ వ్యక్తికైనా అతని గుణ, కర్మ మరియు స్వభావం ద్వారా వర్ణాన్ని నిర్ణయిస్తారు. ఎవరైనా వ్యక్తి నిరక్షరాస్యులై, తమను తాము బ్రాహ్మణుడు అంటే అది తప్పు.

మహర్షి మను గారి ఉపదేశం చదవండి

ఎలాగైతే చెక్క తో చేయబడిన ఏనుగు మరియు చర్మం తో చేయబడిన జింక కేవలం "నామమాత్రంగా" ఏనుగు మరియు జింక అనబడతాయో, అలాగే అక్షర అభ్యాసం చేయని బ్రాహ్మణుడు కేవలం "నామమాత్రపు" బ్రాహ్మణుడు అనబడతాడు. (మనుస్మృతి 2/157)


ప్రశ్న 6: ఒక బ్రాహ్మణ తండ్రి యొక్క సంతానం బ్రాహ్మణులు అనబడతారా, ఎందుకంటే కేవలం అతని తండ్రి బ్రాహ్మణుడు కాబట్టి? 

సమాధానం: ఇది కేవలం ఒక భ్రాంతి మాత్రమే. ఎందుచేతనంటే, డాక్టర్ యొక్క "సంతానం" డాక్టర్ ఎప్పుడు అనబడతారంటే, ఎప్పుడైతే వాళ్లు MBBS డిగ్రీ లో సఫలం అవుతారో. అలాగే ఐ.ఏ.స్, ఇంజనీర్ సంతానం కూడా ఐ.ఏ.స్ మరియు B.Tech లో  సఫలం అవ్వాలి. అలాగే బ్రాహ్మణ అనేది ఒక డిగ్రీ లాంటిదే. అందులోనూ సఫలం అవ్వాలి.

మను గారి ఉపదేశం చదవండి

తల్లి-తండ్రుల ద్వారా ఉత్పన్నం అయిన సంతానం, కేవలం తల్లి గర్భం ద్వారా పొందిన సాధారణ జననం అవుతుంది. వాస్తవానికి జననం విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత లభిస్తుంది. (మనుస్మృతి 2/147)


ప్రశ్న 7: ప్రాచీన కాలంలో బ్రాహ్మణుడు అవడానికి ఏమి చేయాల్సి వచ్చేది?

సమాధానం: ప్రాచీన కాలంలో బ్రాహ్మణుడు అవడానికి విద్యా వంతుడై మరియు గుణవంతుడై ఉండాల్సి వచ్చేది.

మహర్షి మను గారి ఉపదేశం 

వేదాల్లో పారంగతుడు ఆచార్య ద్వారా శిష్యుడికి గాయత్రి మంత్ర దీక్ష ఇచ్చిన తర్వాత శిష్యుడి యొక్క వాస్తవిక మనుష్య జన్మ అవుతుంది. (మనుస్మృతి 2/148)

బ్రాహ్మణ-క్షత్రియ-వైశ్యా, ఈ మూడు వర్ణాలు విద్యాభ్యాసం తో మరో జన్మని ప్రాప్తిస్తారూ. వివిధ కారణాల వలన సరైన విద్యాభ్యాసం చేయని వారిని శూద్ర, నాలుగవ వర్ణం అంటారు. (మనుస్మృతి 10/4)

నేటి సమాజంలో, కొంతమంది తమని తాము బ్రాహ్మణులు అని చెప్పుకుంటారు, ఎందుచేతనంటే వాళ్ళ పూర్వికుల బ్రాహ్మణులు గా ఉన్నారని. ఇది ముమ్మాటికీ తప్పే. యోగ్యత లేకుండా ఎవరూ బ్రాహ్మణుడు అవరు. ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు తమ తప్పస్సు - విద్యా - జ్ఞానం తో సంపూర్ణంగా లోకానికి మార్గదర్శనం చేసేవారు. అందుకే మన ఆర్యవ్రత దేశం విశ్వగురువుగా ఉండేది.


ప్రశ్న 8: బ్రాహ్మణుడిని ఎందుకు శ్రేష్టంగా భావించాలి?

సమాధానం: బ్రాహ్మణ అనేది ఒక గుణవాచకమైన వర్ణం. సమాజంలో అందరికన్నా జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు, విద్యావంతుడు, త్యాగశీలి, తపస్వి, సమాజ మార్గదర్శకుడిగా, ఉండేవారు బ్రాహ్మణులు అవుతారు. అందుకే బ్రాహ్మణుడు శ్రేష్టమైన వ్యక్తి. వైదిక సంస్కృతి లో బ్రాహ్మణుడికి అధిక గౌరవం లభిస్తే, అదే బ్రాహ్మణుడు తప్పు చేస్తే మిగతా వర్ణాల తో పోలిస్తే అధిక శిక్షార్హుడు. 

మహర్షి మను గారి ఉపదేశం 

ఒకటే అపరాధానికి, శూద్రుడికి అందరికన్నా తక్కువ శిక్ష, వైశ్యుడికి రెండింతలు, క్షత్రియుడికి మూడింతలు మరియు బ్రాహ్మణుడికి పదహారు (16) లేక 128 ఇంతలు శిక్ష ఇవ్వాలి. (మనుస్మృతి 8/337 మరియు 8/338)

ఈ శ్లోకాలా ఆధారంగా ఎవరైనా మహర్షి మను ని పక్షపాతి అనలేరు.


ప్రశ్న 9: శూద్రుడు నుంచి బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడు నుంచి  శూద్రుడు అవగలరా?

సమాధానం: బ్రాహ్మణ, శూద్ర, ఇతర వర్ణాలు గుణ, కర్మ మరియు స్వభావం ఆధారంగా విభజించడం జరిగింది. అందుకే వీటిలో పరివర్తన సంభవం. ఏ వ్యక్తి అయినా ప్పుట్టుక తో బ్రాహ్మణుడు అవలేడు. కేవలం విద్యాభ్యాసం తర్వాత అతని వర్ణాన్ని నిర్ణయిస్తారు.

మహర్షి మను గారి ఉపదేశం 

బ్రాహ్మణుడు, శూద్రుడు అవగలడు; శూద్రుడు, బ్రాహ్మణుడు
అవగలడు. ఇదే పద్దతిలో క్షత్రియ - వైశ్య వర్ణాల వారు తమ వర్ణం మార్చుకోగలరు. (మనుస్మృతి 10/64)

శరీరం మరియు మనసు తో  పవిత్రం గా ఉండే వారు, శ్రేష్టమైన వ్యక్తుల సాన్నిధ్యం లో ఉండే వారు, మధురంగా మాట్లాడే వారు, అహంకారం లేనివారు, ఇతర వర్ణాల వారిని తన శారీరిక శ్రమ తో సేవ చేసే శూద్రుడు, ఉత్తమ బ్రాహ్మణ జన్మ మరియు ద్విజ వర్ణాన్ని ప్రాప్తించగలడు. (మనుస్మృతి 9/335)

ఏ వ్యక్తి అయితే ప్రాతః కాలం మరియు సాయం కాలం లో ఈశ్వర ఆరాధన చేయడో అతనిని శూద్రుడు అనుకో వలెను (మనుస్మృతి 2/103)

ఏ వ్యక్తి అయితే వేద విద్యలను ప్రాప్తించడో, అప్పటి వరకు అతను శూద్రుడితో సమానం (మనుస్మృతి 2/172)

బ్రాహ్మణుడు శ్రేష్టమైన అతిశ్రేష్టమైన  వ్యక్తులతో ఉంటూ మరియు నీఛ వ్యక్తులతో దూరంగా ఉంటే, ఎక్కువ శ్రేష్టుడు అవుతాడు. దీనికి విపరీతంగా వ్యవహరిస్తే శూద్రుడు అయిపోతాడు. (మనుస్మృతి 4/245)

ఏ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వేదాల అధ్యయనం చేయడో మరియు ఆచరించడో, ఇతర విషయాల్లో శ్రధ్ధ చూపిస్తాడో, అతడు శూద్రుడు అయిపోతాడు. (మనుస్మృతి 2/168) 


ప్రశ్న 10: ఈనాటి సమయంలో ఎవరైతే తమని తాము బ్రాహ్మణులు అని చెప్పుకుంటునారో, వాళ్ళే మన ప్రాచీన విద్య మరియు జ్ఞానాన్ని కాపాడిన వారా?

సమాధానం: ఈనాటి వ్యక్తుల లో ఎవరైతే బ్రాహ్మణ కుటుబంలో జన్మించినారో , వాళ్ళు ఒకవేళ ప్రాచీన బ్రాహ్మణుల లాగా వైదిక ధర్మాన్ని తమ పురుషార్థాం తో రక్షణ చేస్తున్నారో వాళ్ళు నిశ్చింతగా బ్రాహ్మణుల తో సమానంగా గౌరవపాత్రులు. ఏ వ్యక్తి అయితే బ్రాహ్మణ కుటుబంలో జన్మించి, బ్రాహ్మణ కర్తవ్యాన్ని కి విపరీతంగా కర్మలు చేస్తాడో అతడు బ్రాహ్మణుడు కాడు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక వ్యక్తి విశ్వవిద్యాలయం లో ఉపాధ్యాయుడు, శాకాహారి, గొప్ప వ్యక్తిత్వం గలవాడు, సమాజం - దేశం - ధర్మం కొరకు పాటుపడే వాడు. అతని వర్ణం బ్రాహ్మణ వర్ణం అవుతుంది, అతడి తండ్రి శూద్రుడు అయినా సరే. దీనికి విపరీతంగా కర్మలు చేసే బ్రాహ్మణ తండ్రి యొక్క పుత్రుడు బ్రాహ్మణుడు ఎప్పటికీ కాలేడు. పేరుకే యజ్ఞోపవీతం మరియు శీఖ ధరించే వారు బ్రాహ్మణులు కారు. బ్రాహ్మణుడు గుణ, కర్మ, స్వభావం ద్వారా అవుతారు. ఇదే నిజమైన వైదిక పద్ధతి.


నేను ఈ లేఖ ద్వారా వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ మరియు బ్రాహ్మణ పదానికి సంబంధించిన భ్రాంతులను తొలగించడానికి ప్రయత్నం చేసాను. బ్రాహ్మణ పదానికి సంబంధించి వేదాల్లో మహత్వం ఉంది. ఈ మహత్వం యొక్క ముఖ్య కారణం, జన్మతః బ్రాహ్మణుడు అవడం కాదు, కూర్మనా బ్రాహ్మణుడు అవడం . మధ్య యుగంలో వర్ణం వ్వవస్థ తీరు మారి కులవ్యవస్థ గా మారింది. కులతత్వం హిందూ (భారతీయ) సమాజం యొక్క అత్యంత బాధాకరమైన విషయం. దీని పరిణామాలు మనం నేటికి చూస్తూన్నాము. దీని వల్ల మన సమాజంలో ఐక్యతా లేకుండా పోయింది. అన్న తుమ్ములు మధ్య ద్వేషం పెరిగి పోయింది. దీని వల్ల మనం బలహీన పడ్డాము. అందువలన విధర్మియూలైన దండయాత్రీకులు మన దేశం పై దండెత్తారు 1300 సంవత్సరాల వరకు, ముఖ్య కారణం కులవ్యవస్థ వల్ల మనలో ఐక్యతా లేకపోవడం. కులవ్యవస్థ మనకి అన్నింటి కన్నా పెద్ద శత్రువు. రండి కులవ్యవస్థ నీ వేర్లు నుంచి తీసివేధ్ధాం. సమ సమాజాన్ని నిర్మిద్దాం, కుల మతాలకు అతీతంగా. మనం అంతా హిందువులం (హిందూత్వం మతం కాదు సంస్కృతి),  భారతీయులం. మన పూర్వీకులు ఒకటే.